అందరికి నమస్కారం !!!
ఎన్నో రోజుల నుంచి ఈ బ్లాగ్ రాయాలని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ కి "నా కాబోయే పెళ్ళానికి ప్రేమలేఖ " అని పేరు పెడుతున్న. ఈ బ్లాగ్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇక అసలు విషయం లోకి వెళదాము .
ఎన్నో రోజుల నుంచి ఆలోచిస్తున్నాను, ఎందుకు లవ్ చెయ్యలేక పోయానని అప్పుడు అర్థం అయ్యింది. మనుషులు రెండు రకాలు, ఒకటి మోసపోఎవాళ్ళు, రెండు మోసం చేసేవాళ్ళు. కాని నేను మూడో రకం, అదే మోసోపోకుండా ఉండాలనుకునే వాళ్ళు. అందుకే ఏ అమ్మయిని లవ్ చెయ్యకుండా, ఎవరో కూడా తెలియని నా కాబోయే పెల్లాన్నే లవ్ చేద్దామని డిసైడ్ అయిపోయా. నా పెళ్ళైన మొదటి రోజే ఈ లెటర్ నా పెళ్ళానికి ప్రెసెంట్ చేద్దామనుకుంటున్న.
" నా ప్రియమైన కాబోయే పెళ్ళానికి. నిన్ను ఎన్ని రోజుల నుంచి లవ్ చేస్తున్నానో సరిగ్గా జ్ఞాపకం లేదు కాని, నిన్ను ఎంతగానో లవ్ చేస్తున్నాను. నీ గురించి రోజులో ఒక్కసారైనా ఆలోచిస్తాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, దేవుడు కలలో కనిపించి ఇదిగో నీ పెళ్ళాం ఫోన్ నెంబర్ అని ఇస్తే బావుండు అని. ఐన పెళ్ళిళ్ళు స్వర్గం లో నిర్నైస్తారు అని అంటారు , అలాంటప్పుడు ఎవరెవరికి పెళ్లి జరుగుతుందో ముందే తెలిసిపోతే ఎంచక్కా పెళ్ళికి ముంచే లవ్ చేసుకోవచ్చు కదా. అప్పుడు ఎలాంటి పెళ్లిచూపులు, మ్యారేజ్ beuro , కట్న కానుకలతో లతో పని ఉండదు. అంతకంటే, I LOVE U అని ఎవరివెంట తిరగాల్సిని అవసరం ఉండదు. అవును, ఒకవిషయం మరచిపోయ, నీకు అప్పుడప్పుడు వెక్కిళ్ళు వచ్చేవా? ఎందుకంటే నేను రోజు నీ గురించి ఆలోచిస్తుంటా కదా! మరి నీకు వెక్కిళ్ళు వచ్చే ఉంటాయి. సారీ నిన్ను బాగా ఇబ్బంది పెట్టిఉంటె. నాకైతే ఎప్పుడెప్పుడు నిన్ను కలుసుకోవాలని ఉంది.కాని పెళ్లి వరకు వెయిట్ చెయ్యక తప్పదు. ఇంకా చెప్పాలంటే నా ఫోన్ లో ఒక పేరు ఉంది కాని నెంబర్ ఎంట్రీ కాలేదు. ఏంటో తెలుసా "నా పెళ్ళాం" అని. త్వరగా వచ్చి నీ నెంబర్ నువ్వే ఎంటర్ చెయ్యి. నీ అడ్రస్ తెలిసి ఉంటె తప్పకుండ పోస్ట్ చేసే వాడిని. ఏమ్చేద్ధం , ఈ లెటర్ ఈ బ్లాగ్ కే పరిమితం. ఇంకో విషయం, ఈ లెటర్ రాయటం స్టార్ట్ చేసినప్పతి నుంచి వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. బహుశ నువ్వే కారణం అయుండవచ్చు. ఇంకొద్ది రోజులు వెయిట్ చెయ్, ఈ లెటర్ A4 పేపర్ లో ప్రింట్ తీసి ఇస్తా. ఈ ఒక్క లెటర్ చాలు నిన్ను పడేయ్యటానికి. ఉంటా మరి "
ప్రేమతో నీకు కాబోయే మొగుడు.